బాబు, భువనేశ్వరి కోసం వృద్ధుడి పాదయాత్ర..
ABN, First Publish Date - 2023-10-05T12:11:06+05:30 IST
గుంటూరు జిల్లా: వినుకొండ నియోజక వర్గంలో వైసీపీ అరాచకం బయటపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం, భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా వస్తున్న వృద్ధుడిపై వైసీపీ దాడికి పాల్పడింది.
గుంటూరు జిల్లా: వినుకొండ నియోజక వర్గంలో వైసీపీ అరాచకం బయటపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం, భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా వస్తున్న వృద్ధుడిపై వైసీపీ దాడికి పాల్పడింది. నారాయణ (63) నంద్యాల జిల్లా, చిన్నదేవళాపురం నుంచి రాజమండ్రికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో వినుకొండ మండలం, విఠల్‌రాజ్ పల్లె వద్ద వృద్ధుడిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన నారాయణను టీడీపీ వర్గీయులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆస్పత్రికి చేరుకుని నారాయణను పరామర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-10-05T12:11:06+05:30