న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు

ABN, First Publish Date - 2023-09-28T09:36:45+05:30 IST

అమరావతి: సోషల్ మీడియాలో పలువురు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 26 మందిపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని ఏపీ హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది.

అమరావతి: సోషల్ మీడియాలో పలువురు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 26 మందిపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని ఏపీ హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా ఐడీలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి ఇటీవల విజయవాడ కోర్టుతో పాటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో పలువురు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఫిర్యాదులు వచ్చాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-28T09:36:45+05:30