బంగారు తెలంగాణ కాదు..మట్టి తెలంగాణ..

ABN, First Publish Date - 2023-06-08T12:15:34+05:30 IST

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం గొప్పలు చెబుతూ శతాబ్ది ఉత్సవాలు చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి.

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం గొప్పలు చెబుతూ శతాబ్ది ఉత్సవాలు చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. వరంగల్ జిల్లా, ఇల్లందు మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ధాన్యం తీసుకువచ్చి నెలరోజులగా పడిగాపులు కాస్తున్నామని, అధికారులు కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదని.. మట్టి తెలంగాణ అని అన్నారు. తలతీసి మొలేసుకున్నా.. శతాబ్ది సంబరాలు లేవని, ఏడుపు తప్పా ఏమీ లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-08T12:15:34+05:30