కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై కోర్టులో పిటిషన్
ABN, First Publish Date - 2023-09-08T11:53:08+05:30 IST
అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త రిజిస్ట్రేషన్ విధానం రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమని కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరాం ప్రసాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.
అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త రిజిస్ట్రేషన్ విధానం రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమని కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరాం ప్రసాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. సాక్షులు లేని దస్తావేజులు చెల్లనివిగా పరిగణించబడతాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలు అందించకుండా కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తామంటూ చేసిన ప్రకటన రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-08T11:53:08+05:30