పోలవరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు
ABN, First Publish Date - 2023-08-17T08:58:05+05:30 IST
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కాఫర్ డ్యామ్ కాలం తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని సర్వత్రా మాటలు వినిపిస్తున్నాయి.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కాఫర్ డ్యామ్ కాలం తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని సర్వత్రా మాటలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం డోలాయమానంలో పడింది. గడువును పదే పదే పొడిగిస్తూ పోతున్నారు. ఇదే సమయంలో కీలక నిర్మాణాలన్నీ దెబ్బతింటున్నాయి. తాజాగా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించే తాత్కాలిక కట్టడమైన ఎగువ కాఫర్ డ్యాం ‘ఎక్స్‌పైర్’ అయిపోయిందని నిపుణులు చెబుతున్నారు. కాలం చెల్లిన ఈ డ్యాం.. భవిష్యత్‌లో పోలవరం ప్రధాన పనులకు ఎంతవరకు దన్నుగా నిలుస్తుందన్నది ప్రశ్నార్థకమేనని అంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి ..
Updated at - 2023-08-17T08:58:55+05:30