22న ఇండియా కూటమి దేశవ్యాప్త నిరసన..
ABN, Publish Date - Dec 20 , 2023 | 10:19 AM
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీలు సస్పెన్షన్‌పై ఈనెల 22వ తేదీన దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీలు సస్పెన్షన్‌పై ఈనెల 22వ తేదీన దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎంలతో పాటు అనుసంధానిస్తున్న వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిగా లెక్కించాలని, ఆ తర్వాతే ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని మరో తీర్మానం చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్ల పంపకాలపై ఈ నెలాఖరులోగా రాష్ట్రాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని, దానిపై పార్టీల జాతీయ నాయకత్వం జనవరి రెండోవారం నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 20 , 2023 | 10:19 AM