మైనంపల్లిపై బీఆర్‌ఎస్‌ వేటు..?

ABN, First Publish Date - 2023-08-29T07:43:43+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో రానున్న ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల లిస్టు ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. చాలామంది ఆశావహులు టికెట్ దక్కకపోవడంతో అసమ్మతి రాగం వినిపిస్తుంటే.. మైనంపల్లి హన్మంతరావు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: తెలంగాణలో రానున్న ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల లిస్టు ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. చాలామంది ఆశావహులు టికెట్ దక్కకపోవడంతో అసమ్మతి రాగం వినిపిస్తుంటే.. మైనంపల్లి హన్మంతరావు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇటీవల మంత్రి హరీష్‌రావుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తన కొడుక్కి మెదక్ సీటు ఇవ్వాలని లేదంటే తాను బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనని మైనంపల్లి షరతు పెట్టారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డికి టిక్కెట్ కేటాయించారు. ఇప్పటికే హరీష్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-29T07:43:43+05:30