పల్లాపై మండిపడ్డ ముత్తిరెడ్డి
ABN, First Publish Date - 2023-08-29T10:02:51+05:30 IST
హైదరాబాద్: బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల టిక్కెట్ ఫైట్ కొనసాగుతోంది. తమ స్థానాలను ఆశిస్తున్నవారిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల టిక్కెట్ ఫైట్ కొనసాగుతోంది. తమ స్థానాలను ఆశిస్తున్నవారిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. జనగామ, నరసాపూర్, ములుగు నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి, అసమ్మతితో రాజకీయం రసకందాయంలో పడింది. జనగామ సీటు ఆశిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మండిపడుతున్నారు. సాయం చేసే గుణమేలేని పల్లా.. జనగామలో ప్రజాసేవ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలకు సమయం ఇవ్వని పల్లా అక్రమ సంపాదనతో పరిచయాలపేరిట నాయకులను కొనుగోలు చేస్తూ నియోజక వర్గాన్ని కకావికలం చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-29T10:02:51+05:30