Minister KTR: కరీంనగర్‎లో ఈసారి గులాబీ జెండా ఎగురవేస్తాం..

ABN, First Publish Date - 2023-01-11T07:27:11+05:30 IST

మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్‌ ప్రధాన కార్యాలయంలో(Cess Head Office) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, అనంతరం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ

Rajanna Sirisilla: మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్‌ ప్రధాన కార్యాలయంలో(Cess Head Office) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, అనంతరం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ (Minister KTR)మాట్లాడుతూ.. గుజరాతోళ్లు దోచుకున్న సంపద, పైసలే సెస్‌ ఎన్నికల్లో వచ్చాయని, బండి సంజయ్‌ రూ.5 కోట్లు తెచ్చి ఓటుకు రూ.4 వేల వరకు పంచుతున్నారంటూ అనేక మంది ఫోన్లు చేశారని తెలిపారు. సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్‌) ఎన్నికల్లో ట్రైలర్‌ మాత్రమే చూపించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అసలు సినిమా చూపిస్తామన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంపై గులాబీ జెండా ఎగరేయడానికి సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని, బీఆర్‌ఎస్‌ శ్రేణులు అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Updated at - 2023-01-11T07:29:14+05:30