బీఆర్ఎస్‌కు సవాల్‌గా మారిన లోక్‌సభ ఎన్నికలు...
ABN, Publish Date - Dec 26 , 2023 | 09:25 AM
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్‌కు రానున్న లోక్ సభ ఎన్నికలు మరో సవాల్‌గా పరిణమించనున్నాయి. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ‘సారు.. కారు.. 16’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఆ పార్టీ 9 ఎంపీ స్థానాలకే పరిమితం అయింది.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్‌కు రానున్న లోక్ సభ ఎన్నికలు మరో సవాల్‌గా పరిణమించనున్నాయి. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ‘సారు.. కారు.. 16’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఆ పార్టీ 9 ఎంపీ స్థానాలకే పరిమితం అయింది. ఇటు జహీరాబాద్, వరంగల్, చెవెళ్ల, మహబూబాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నాగర్ కర్నూల్, పెద్ద పల్లి స్థానాలను దక్కించుకుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే 9 స్థానాలు లభిస్తే.. ఈసారి అధికారం కోల్పోయిన పరిస్థితిలో.. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను ఆకట్టుకునేల కొత్త కొత్త హామీల అమలుతో దూసుకుపోతున్న తరుణంలో బీఆర్ఎస్‌కు ఎన్నిస్థానాలు లభిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 26 , 2023 | 09:25 AM