లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు
ABN, First Publish Date - 2023-08-19T11:07:51+05:30 IST
విజయవాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంది. శనివారం నుంచి వారం రోజులపాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది.
విజయవాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంది. శనివారం నుంచి వారం రోజులపాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో టీడీపీ కటౌట్‌లను తొలగిస్తున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీకి చెందిన ఫ్లెక్సీలకు అనుమతి ఇస్తారు.. టీడీపీ ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. కావాలనే వైసీపీ నేతలు లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-19T11:09:39+05:30