Gandhi Bhavan: కలిసి పనిచేద్దామంటూ రేవంత్‌కు స్నేహ హస్తం..

ABN, First Publish Date - 2023-01-21T08:44:55+05:30 IST

కొంత కాలంగా గాంధీభవన్‌ కార్యకలాపాల్లో అంటీముట్టనట్లుగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komati Reddy Venkat Reddy).. శుక్రవారం

హైదరాబాద్: కొంత కాలంగా గాంధీభవన్‌ కార్యకలాపాల్లో అంటీముట్టనట్లుగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komati Reddy Venkat Reddy).. శుక్రవారం గాంధీభవన్‌లో దర్శనమిచ్చారు. హాత్‌సే హాత్‌ జోడో అభియాన్‌(Hathse Hath Jodo Abhiyan)పై సమీక్షల కోసం వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే(Manikrao Thackeray)ను, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy)నీ కలిశారు. పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామంటూ రేవంత్‌(Revanth)కు స్నేహ హస్తాన్ని అందించారు. కలిసి పాదయాత్రా చేద్దామంటూ ప్రతిపాదించారు. నాగర్‌ కర్నూలులో ఆదివారం తలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో తానూ పాల్గొంటానని ఈ సందర్భంగా రేవంత్‌కు కోమటిరెడ్డి చెప్పారు.

Updated at - 2023-01-21T08:45:15+05:30