సీబీఐ తలచుకుంటే ఇంత సీన్ అవసరమా?

ABN, First Publish Date - 2023-05-22T11:11:19+05:30 IST

హైదరాబాద్: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును డైవర్టు చేయడానికి ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేదని కొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకువచ్చారని హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ అన్నారు.

హైదరాబాద్: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును డైవర్టు చేయడానికి ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేదని కొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకువచ్చారని హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన డిబెట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో సీబీఐ డ్రామాలు ఆడుతోందని అనిపిస్తోందన్నారు. వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్నప్పుడు, ఆ విచారణకు గైర్హజరవుతున్నప్పుడు ఇన్ని రోజులు సీబీఐ అధికారులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను సుప్రీం కోర్టు కూడా సర్టిఫైడ్ చేసిందని.. మరి ఎందుకు అవినాష్‌ను అరెస్టు చేయలేదని నిలదీశారు. అవినాష్ రెడ్డి ఇప్పటికే 5, 6 దఫాలు విచారణకు వచ్చారని.. అరెస్టు చేస్తామని చెప్పిన అధికారులు అరెస్టు చేయకుండా.. ఇవాళ ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నారని ప్రశ్నించారు. సీబీఐ తలచుకుంటే ఇంత సీన్ అవసరమా? అని న్యాయవాది సుంకర నరేష్ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-22T11:11:19+05:30