కోడికత్తి కేసు విశాఖకు బదిలీ..

ABN, First Publish Date - 2023-08-08T11:47:15+05:30 IST

అమరావతి: ఏపీలో సంచలనం కలిగించిన కోడికత్తి కేసు విచారణ మంగళవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరగనుంది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌తో పాటు సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.

అమరావతి: ఏపీలో సంచలనం కలిగించిన కోడికత్తి కేసు విచారణ మంగళవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరగనుంది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌తో పాటు సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ కేసును విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ.. విజయవాడ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి గతవారమే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఇవాళ ఇవ్వనున్నారు. కాగా కేసు బదిలీపై నిందితుడి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated at - 2023-08-08T11:47:15+05:30