తుమ్మల, పొంగులేటిపై కేసీఆర్ విసుర్లు..

ABN, First Publish Date - 2023-11-06T09:01:49+05:30 IST

ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (ఆదివారం) ఖమ్మంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పలు అంశాలకు సంబంధించి మాట్లాడుతూ.. ఒక వైపు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (ఆదివారం) ఖమ్మంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పలు అంశాలకు సంబంధించి మాట్లాడుతూ.. ఒక వైపు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా తుమ్మల, పొంగులేటి స్పందించారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. దేశంలో ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని కేసీఆర్ అన్నారు. అవి గెలిచినచోటే ఆ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌తోనే సురక్ష తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు. ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ల లైట్లు వెలుగుతాయన్నారు. ఢిల్లీ గులాంలకు మనం గులాం కాకూడదని ముఖ్యమంత్రి అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-06T09:01:51+05:30