బీఆర్ఎస్‌లో అసంతృప్తులకు పదవుల వల ..

ABN, First Publish Date - 2023-10-06T10:19:05+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లు నియమితులయ్యారు. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తెలంగాణ రైతు బంధు సమితి ఛైర్మన్‌గా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య...

హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లు నియమితులయ్యారు. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తెలంగాణ రైతు బంధు సమితి ఛైర్మన్‌గా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్‌గా ఉప్పల వెంకటేష్ గుప్తను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నియమితులైనవారు రెండేళ్లపాటు ఆయా పదవుల్లో ఉంటారు. ఈ నియామకాలు బీఆర్ఎస్‌లో అసంతృప్తులకు బుజ్జగింపులకేనని వాదనలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-06T10:20:32+05:30