తెలంగాణలో పోటీపై కాసాని కీలక వ్యాఖ్యలు..
ABN, First Publish Date - 2023-10-17T10:37:42+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. తెలంగాణ జనసేన ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమేనన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. తెలంగాణ జనసేన ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమేనన్నారు. ఇక తెలంగాణలో పోటీకి 119 మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. బుధవారం మరోసారి చంద్రబాబును కలిసాక అభ్యర్థుల జాబితాపై స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికల్లో టీటీడీపీ పోటీ చేయదనే అపోహను నమ్మోద్దని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-17T10:37:42+05:30