Karnataka: హైదరాబాద్‌కు కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!
ABN, First Publish Date - 2023-05-13T10:50:02+05:30 IST
బెంగళూరు: కర్నాటక ఎన్నికల ఫలితాలు (Karnataka Election Results) వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కొనసాగుతోంది.
బెంగళూరు: కర్నాటక ఎన్నికల ఫలితాలు (Karnataka Election Results) వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన మొదటి, రెండు రౌండ్లకు సంబంధించిన ఫలితాల్లో కాంగ్రెస్ 114 స్థానల్లో లీడ్‌లో ఉంటే... బీజేపీ (BJP) 84 స్థానల్లో కొనసాగుతోంది. జేడీఎస్ (JDS) 24 స్థానాల్లో మాత్రమే అధిక్యంలో ఉంది. కొత్తగా పార్టీ పెట్టిన గాలి జనార్థన్ రెడ్డి దంపతులు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వస్తుంటే.. మరోవైపు ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ బెంగళూరు చేరుకోవాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు క్యాంప్ రాజకీయాలకు తెరలేచే పరిస్థితి ఉంది. హైదరాబాద్‌లో హోటల్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. తాజ్ కృష్ణ, పార్క్ హయత్, నోవాటెల్‌లో కర్నాటక వ్యక్తులు రూమ్‌లు బుక్ చేసినట్లు సమాచారం. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను ఆయా హోటళ్లకు తరలించే అవకాశముంది.
Updated at - 2023-05-13T10:50:02+05:30