రసవత్తరంగా తెలంగాణ ఎన్నికలు..
ABN, First Publish Date - 2023-11-20T10:32:24+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల మేనిఫేస్టోలు వచ్చాయి. ప్రధాన పార్టీల అగ్ర నాయకులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల మేనిఫేస్టోలు వచ్చాయి. ప్రధాన పార్టీల అగ్ర నాయకులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అభివృద్ధి చేశాం.. మళ్లీ అధికారంలోకి వస్తామని అధికారపార్టీ బీఆర్ఎస్ అంటోంది. అయితే తెలంగాణ ఇచ్చాం.. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అంటోంది. అభివృద్ధి, సంక్షేమం ఏ స్థాయిలో ఉంటుందో చేసి చూపిస్తామంటోంది. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఒక దశలో బీఆర్ఎస్‌కు బీజీపీయే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ నేతలు అన్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన, మేనిఫేస్టో విడుదలలో బీజేపీ వెనుకబడింది. కానీ అగ్రనాయకులు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-20T10:32:26+05:30