కేతిరెడ్డి, పెద్దారెడ్డికి.. జీసీ ప్రభాకర్ రెడ్డి సవాల్..
ABN, First Publish Date - 2023-06-22T11:52:00+05:30 IST
అనంతపురం: వైసీపీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి, పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పట్టణంలోని కృష్ణాపురం 7వ రోడ్డులో అండర్ డ్రైనేజి బ్లాక్ పనులు 11 నెలలు అవుతున్నా.. పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం: వైసీపీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి, పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పట్టణంలోని కృష్ణాపురం 7వ రోడ్డులో అండర్ డ్రైనేజి బ్లాక్ పనులు 11 నెలలు అవుతున్నా.. పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పనులు వారు చేయరు.. చేసేవారిని చేయనివ్వరంటూ’ అసహనం వ్యక్తం చేశారు. అండర్ డ్రైనేజి పనులపై కొద్ది రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. నేటి నుంచి తన సొంత డబ్బులతో పనులు చేస్తానని, చేతనైతే ఆపుకోవాలంటూ ఎమ్మెల్యేలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
Updated at - 2023-06-22T11:52:00+05:30