జనసేన ఆధ్వర్యంలో జలదీక్ష..
ABN, First Publish Date - 2023-10-03T12:29:59+05:30 IST
కృష్ణాజిల్లా: గుడివాడ బైపాస్ రోడ్డుపై జనసైనికులు, సామాజిక కార్యకర్తలు జలదీక్ష చేశారు. ఏలూరు రోడ్డు నుంచి బంటుమిల్లి వరకు బైపాస్ రోడ్డు అధ్వన్నంగా ఉందని ధ్వజమెత్తారు.
కృష్ణాజిల్లా: గుడివాడ బైపాస్ రోడ్డుపై జనసైనికులు, సామాజిక కార్యకర్తలు జలదీక్ష చేశారు. ఏలూరు రోడ్డు నుంచి బంటుమిల్లి వరకు బైపాస్ రోడ్డు అధ్వన్నంగా ఉందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని రహదారి తటాకాన్ని తలపిస్తోందని దుమ్మెత్తిపోశారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని జనసేన నాయకుడు, సామాజిక కార్యకర్త మాచర్ల రామకృష్ణ విమర్శించారు. గోతుల్లో వాహనాలు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-03T12:29:59+05:30