తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

ABN, First Publish Date - 2023-11-05T08:27:08+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 8 సీట్లు కేటాయించింది. కలిసి పోటీ చేస్తామని ఈ రెండు పార్టీల నాయకులు ఇప్పటికే ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 8 సీట్లు కేటాయించింది. కలిసి పోటీ చేస్తామని ఈ రెండు పార్టీల నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా జనసేనకు ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట, నగర్ కర్నూల్, కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్ తదితరులు నిన్న రాత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-05T08:27:13+05:30