Telanganaలో జనసేన ఏడు నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో పోటీ

ABN, First Publish Date - 2023-01-25T11:12:26+05:30 IST

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) పర్యటించారు. కొండగట్టు అంజన్న

Karimnagar: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) పర్యటించారు. కొండగట్టు అంజన్న(Kondagattu Anjanna) ఆలయానికి మంగళవారం వచ్చిన ఆయన.. తొలుత స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం తన ‘వారాహి’('Varahi') ప్రచార రథానికి వాహనపూజ చేయించారు. ఈ సందర్భంగా ఆయన తన భక్తులు, అభిమానులు, జనసేన కార్యకర్తలనుద్దేశించి వారాహి వాహనంపై నుంచి ప్రసంగించారు. జగిత్యాల శివారులోని బృందావనం ఫ్యామిలీ రిసార్ట్స్‌కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. అనంతరం వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానన్నారు. తెలంగాణలో జనసేన ఏడు నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో తమకు పది మంది ఎమ్మెల్యేలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్‌(TRS) బీఆర్‌ఎస్‎గా(BRS) ఆవిర్భవించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.

Updated at - 2023-01-29T18:52:08+05:30