జగనన్న గోరుముద్ద పథకంలో నాసిరకం పదార్ధాలు..
ABN, First Publish Date - 2023-10-13T11:00:31+05:30 IST
పల్నాడు జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకం అద్వాన్నంగా తయారైంది. గడువు ముగిసిన పౌష్టికాహారం పిల్లలకు అందించడం ఆందోళనకు గురిచేస్తోంది.
పల్నాడు జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకం అద్వాన్నంగా తయారైంది. గడువు ముగిసిన పౌష్టికాహారం పిల్లలకు అందించడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, ఇరికేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గడువు ముగిసిన రాగిపిండి జావను విద్యార్థులకు ఇస్తున్నారు. దీనికితోడూ స్కూల్లో కుళ్లిన టమోటాలు, నాణ్యతలోని బియ్యంతో భోజనం పెడుతూ.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-10-13T11:00:31+05:30