జగన్ పర్యటన.. టీడీపీ నేతల అరెస్టులు..
ABN, First Publish Date - 2023-11-07T09:53:51+05:30 IST
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పుట్టపర్తికి వస్తుండడంతో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పుట్టపర్తికి వస్తుండడంతో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కరువు ప్రాంతాలను పరిశీలించేందుకు మడకశిర వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మడకశిర నుంచి అర్ధరాత్రి పోలీసు వాహనాల్లో పెనుకొండకు తరలించారు. పెనుకొండ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్బంధించారు. సీఎం జగన్ పర్యటన పూర్తయ్యేవరకు టీడీపీ నేతలను విడిచి పెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-07T09:53:52+05:30