India-New Zealand: భారత్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డే హైదరాబాద్‎లోనే..

ABN, First Publish Date - 2023-01-12T09:12:37+05:30 IST

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డేకు రంగం సిద్ధమవుతోంది. గత సెప్టెంబరులో భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌

హైదరాబాద్: భారత్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డేకు రంగం సిద్ధమవుతోంది. గత సెప్టెంబరులో భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌ బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపాడు.

న్యూజిలాండ్‌తో ఈనెల 18వ తేదీన ఆరంభమవనున్న మూడు వన్డేల సిరీస్‎లోని తొలి మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుండడం తెలిసిందే. ఈ మ్యాచ్‌ టిక్కెట్లను శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు.

Updated at - 2023-01-12T09:14:10+05:30