ఆస్పత్రిలో ఇలియానా..ఆందోళనలో అభిమానులు

ABN, First Publish Date - 2023-01-31T12:34:23+05:30 IST

ఇలియానా (Ileana) ఈ భామను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో

ఇలియానా (Ileana) ఈ భామను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో ఈ సుందరి సినిమాలు చేసింది.డ ‘దేవదాస్’ (Deavadas) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇలియానా (Ileana). ‘పోకిరి’ (Pokiri), ‘జల్సా’ (Jalsa) వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్స్ రావడంతో అక్కడే సినిమాలు చేసి స్థిరపడిపోయింది. తాజాగా ఈ గోవా సుందరి అస్వస్థతకు గురయింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను ఫాలోయర్స్‌తో పంచుకుంది. చేతికి సెలైన్ బాటిల్ ఉన్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇలియానా ఫ్యాన్స్ ఏమైందంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

Updated at - 2023-02-04T17:16:08+05:30