ఆసుపత్రి వద్ద అవినాష్ అనుచరుల హల్ చల్..

ABN, First Publish Date - 2023-05-22T12:40:52+05:30 IST

కర్నూలు: విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఎంపీ అవినాష్ అనుచరులు హల్ చల్ చేస్తున్నారు. సీబీఐ అధికారులు ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

కర్నూలు: విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఎంపీ అవినాష్ అనుచరులు హల్ చల్ చేస్తున్నారు. సీబీఐ అధికారులు ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు ఉన్నారంటే ఉన్నారు... అంతే.. అక్కడి నుంచి ఎవరినీ దూరంగా పంపే ప్రయత్నం చేయడంలేదు. నిందితుడిని విచారించేందుకు సీబీఐ వచ్చినప్పుడు వాళ్లకు అన్ని విధాల రక్షణ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అదీ జరగడంలేదు... ఉద్రిక్తతమైన పరిస్థితి ఆస్పత్రి వద్ద నెలకొంది. ఈ పరిస్థితిలో సీబీఐ అధికారులు ఆస్పత్రి లోపలకు వెళ్లి అవినాష్‌ను కలిసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో సీబీఐ జిల్లా ఎస్పీతో మాట్లాడి తమకు ప్రొటక్షన్ కావాలని కోరారు. దీంతో కొంతమంది పోలీసులు ఆస్పత్రి వద్దకు బందోబస్తు వచ్చినప్పటికీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకు? ఎంటీ అనేదానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-22T12:40:52+05:30