వైసీపీ నేతల హౌస్ అరెస్టు

ABN, First Publish Date - 2023-06-30T11:03:59+05:30 IST

గూడూరు, (నెల్లూరు జిల్లా): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది.

గూడూరు, (నెల్లూరు జిల్లా): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. కోట గ్రామంలో జరిగిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్‌పై లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. లోకేష్ చేసిన ఆరోపణలు ఖండించాల్సిన వైసీపీ నేతలు ఎదురుదాడికి ప్లాన్ చేస్తున్నారు. చిల్లకూరు మండలంలో జరుగుతున్న లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. వైసీపీ నేతలు మీరారెడ్డి, సతీష్ రెడ్డి తమ అనుచరులతో పాదయాత్రకు ఆటంకం కలిగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయం ముందుగా గుర్తించిన పోలీసులు వైసీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-30T11:03:59+05:30