తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ABN, First Publish Date - 2023-07-19T11:36:38+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. మూడు రోజులుగా నగరాన్ని ముసురు వదలడంలేదు. అల్పపీడనం ప్రభావంతో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-19T11:36:38+05:30