భయంగుప్పిట్లో భాగ్యనగర ప్రజలు..
ABN, First Publish Date - 2023-07-28T10:08:52+05:30 IST
హైదరాబాద్: కుండపోతగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్: కుండపోతగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో భారీ వర్షం పడుతోంది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో నాన్ స్టాప్‌గా వర్షం పడుతోంది. అలాగే బోయినపల్లి, సనత్ నగర్, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, బాలానగర్, అల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-28T10:08:52+05:30