గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం బీభత్సం
ABN, Publish Date - Sep 05 , 2023 | 02:33 PM
హైదరాబాద్: నగరంలో మంగళవారం తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్: నగరంలో మంగళవారం తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. కుండపోత వానతో రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. ఈదురుగాలులకు చెట్లు నెలకొరిగాయి. వందలాది కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి భాగ్యనగరం అంథకారంలో ఉండిపోయింది. సెక్రటేరియట్ ముందు భారీగా వర్షపునీరు నిలిచింది. సచివాలయం ముందున్న బస్టాప్‌లన్నీ నీటమునిగాయి. ఒకే దగ్గర వర్షపునీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Aug 10 , 2024 | 04:40 PM