చంద్రబాబు కోసం లాయర్ హరీష్ సాల్వే

ABN, First Publish Date - 2023-09-19T12:01:50+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున న్యాయవాదుల అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున న్యాయవాదుల అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. బాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే హాజరవుతారని న్యాయవాదులు తెలిపారు. కాగా చంద్రబాబును అరెస్టు చేసి 10 రోజులు అవుతోంది. ఈ రోజు కీలకమైన కేసులు కూడా విచారణకు రాబోతున్నాయి. దీని తర్వాత ఏసీబీ కోర్టులో కూడా మరో కేసు విచారణ జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-19T12:02:59+05:30