ఎంఎస్ఎంఈలపై జగన్ సర్కార్ చిన్నచూపు..
ABN, First Publish Date - 2023-08-08T10:25:24+05:30 IST
అమరావతి: అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నో హామీలను విస్మరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం రెండేళ్లుగా ప్రోత్సాహకాలు చెల్లించడంలేదు.
అమరావతి: అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నో హామీలను విస్మరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం రెండేళ్లుగా ప్రోత్సాహకాలు చెల్లించడంలేదు. గత ఏడాది ఆగస్టులోనే నిధులు విడుదల చేయాల్సి ఉండగా ఆ తర్వాత అక్టోబర్, ఈ ఏడాది ఫిబ్రవరి, మళ్లీ జూలై అంటూ వాయిదాలు వేస్తూ వస్తోంది. ఆగస్టు నెల వచ్చినా ప్రోత్సహాకాల ఊసే లేదు. ఇప్పటి వరకు మొత్తం రూ. 4వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తున్న ఎంఎస్ఎంఈలను సర్కార్ చిన్నచూపు చూస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-08T10:25:24+05:30