Group Politics: కమలాపూర్ బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు..

ABN, First Publish Date - 2023-05-09T11:37:00+05:30 IST

కరీంనగర్: తెలంగాణలో ఎన్నికలు (Elections) సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి.

కరీంనగర్: తెలంగాణలో ఎన్నికలు (Elections) సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. కమలాపూర్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (MLC Kaushik Reddy) ఎదురుగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కుర్చీలు విసురుకున్నారు. విమర్శలతో మొదలైన వివాదం చివరికి చెప్పుల దాడి వరకు చేరుకుంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన కౌశిక్ రెడ్డి.. పార్టీలో ఇబ్బందులు ఉన్నవాళ్లు వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనాలు వర్గపోరుకు వేదికలుగా మారాయి.

Updated at - 2023-05-09T11:37:00+05:30