బాబు అరెస్టుపై జర్మనీ ఐటీ ఉద్యోగిని నిరసన
ABN, First Publish Date - 2023-10-03T12:07:15+05:30 IST
జర్మనీ: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై జర్మనీ ఐటీ ఉద్యోగిని ప్రతిభ నిరసన వ్యక్తం చేశారు. తెలుగువారికి ఐటీనీ పరిచయం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ఆమె ప్రశ్నించారు.
జర్మనీ: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై జర్మనీ ఐటీ ఉద్యోగిని ప్రతిభ నిరసన వ్యక్తం చేశారు. తెలుగువారికి ఐటీనీ పరిచయం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ఆమె ప్రశ్నించారు. విదేశాల్లో తాము ఉన్నతంగా జీవించడానికి ఆయన దార్శినికతే కారణమన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో గత 8 ఏళ్లుగా నివశిస్తున్న ఆమె జన్మన్ సెంట్రల్‌లో చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలిపారు. బాబుకు మద్దుతుగా 'We are with CBN Our Future TDP' పేరుతో విదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రతిభ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-03T12:07:15+05:30