Tirupathi: అలిపిరిలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ శ్రమదానం..

ABN, First Publish Date - 2023-05-13T11:45:52+05:30 IST

తిరుపతి సామూహిక శ్రమదానంతో సుందర తిరుమల కార్యక్రమాన్ని అలిపిరి వద్ద సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.

చిత్తూరు జిల్లా: తిరుపతి సామూహిక శ్రమదానంతో సుందర తిరుమల కార్యక్రమాన్ని అలిపిరి వద్ద సుప్రీం కోర్టు (Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (Former CJI NV Ramana) శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని గత 13 రోజులుగా టీటీడీ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. స్వచ్ఛంద సేవతో సుందర తిరుమలకు అందరూ పూనుకోవటం అభినందనీయమన్నారు. న్యాయమూర్తులకు స్వచ్ఛందసేవకు అవకాశం కల్పించాలని 2008లో అప్పుడు జాయింట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మారెడ్డిని కోరినట్లు తెలిపారు. అది గుర్తుపెట్టుకున్న ఆయన ఈ రోజు తనను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారన్నారు.

తిరుమల పవిత్రత తమ కర్తవ్యంగా భక్తులు భావించాలని ఎన్వీ రమణ అన్నారు. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానన్నారు. అనేక దేవతలు సంచరించిన సప్తగిరులకు ఎంతో పవిత్రత ఉందన్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా చూసుకోవాలని సూచించారు. భక్తులు కూడా శుద్ధ తిరుమల.. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.

Updated at - 2023-05-13T11:45:52+05:30