రేపు బీజేపీ అభ్యర్థుల తొలి జాబిత విడుదల
ABN, First Publish Date - 2023-10-18T11:34:43+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అభ్యర్థులు తొలి జాబితా గురువారం విడుదల కానుంది. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టుపై కసరత్తు చేపట్టనుంది.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అభ్యర్థులు తొలి జాబితా గురువారం విడుదల కానుంది. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టుపై కసరత్తు చేపట్టనుంది. సుమారు 40 మందితో తొలి జాబితాను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. టికెట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమలం పార్టీ నిర్ణయించింది. మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు కేటాయించనున్నారు. ప్రతి బీసీ కులానికి ఒక సీటు ఇచ్చేలా కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-18T11:34:43+05:30