సోనియా-రాహుల్‌పై ఈడీ గురి..

ABN, First Publish Date - 2023-11-22T10:27:00+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఆ పత్రిక యాజమాన్య సంస్థ యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఆ పత్రిక యాజమాన్య సంస్థ యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్స్ అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్‌తో పాటు దానిని నిర్వహిస్తున్న యంగ్ ఇండియన్‌పై ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ ఆర్డర్‌ను జారీ చేసినట్లు ప్రకటించింది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే సోనియా, రాహుల్, ఖర్గేలను ప్రశ్నించారు. యంగ్ ఇండియన్ కంపెనీలో సోనియా, రాహుల్‌కు 38 శాతం వాటాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-22T10:27:02+05:30