ఏపీలో ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్

ABN, First Publish Date - 2023-08-25T10:16:10+05:30 IST

అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఓట్ల తొలగింపు కట్టడి కోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేస్తే కేసులు నమోదు చేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది.

అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఓట్ల తొలగింపు కట్టడి కోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేస్తే కేసులు నమోదు చేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కలెక్టర్లకు ఆ సమాచారాన్ని అందజేశారు. ఒకే వ్యక్తి ఐదు కంటే ఎక్కువ దరఖాస్తులు ఇస్తే వాటిని ఈఆర్వో స్వయంగా పరిశీలించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. పరిశీలన సమాచారం క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇవ్వాలని ఈఆర్వోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-25T10:16:10+05:30