పాలమూరు జిల్లా బీజేపీలో అసమ్మతి..
ABN, First Publish Date - 2023-11-06T08:46:45+05:30 IST
మహబూబ్‌నగర్ జిల్లా: ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలతో ప్రచారం హోరెత్తుతోంది.
మహబూబ్‌నగర్ జిల్లా: ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలతో ప్రచారం హోరెత్తుతోంది. జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించింది. అధికార బీఆర్ఎస్ కూడా ఒక్క అలంపూర్‌కు మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అధికారంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ మాత్రం మూడు విడతల్లో ఆరు స్థానాలకే తమ అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన కొన్ని నియోజక వర్గాల్లో అసమ్మతి రగులుతోంది. వనపర్తి, షాద్‌నగర్‌లో సీట్లు ఆశించి భంగపడిన నేతలు అభ్యర్థుల ఎంపికలో పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-06T08:46:46+05:30