వరద గుప్పిట్లో దేశ రాజధాని
ABN, First Publish Date - 2023-07-14T10:15:35+05:30 IST
న్యూఢిల్లీ: యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమవుతోంది. ఎగువ రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులపాటు కుండపోతల వానలతో ఢిల్లీలో యమునా 45 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టి ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది.
న్యూఢిల్లీ: యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమవుతోంది. ఎగువ రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులపాటు కుండపోతల వానలతో ఢిల్లీలో యమునా 45 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టి ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. గురువారం మధ్యాహ్నం 206.62 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం నిలకడగా ఉన్నా.. ఢిల్లీ వరద గుప్పిట్లోనే ఉంది. వరద ముప్పుతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సేవలు మినహా మిగతా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-14T10:15:35+05:30