ప్రత్యర్థుల కట్టడికి కాంగ్రెస్ వ్యూహం..
ABN, First Publish Date - 2023-11-05T10:39:18+05:30 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుమీదన్న కాంగ్రెస్ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇతర పార్టీల ముఖ్యనేతలను ఆకర్షించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుమీదన్న కాంగ్రెస్ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇతర పార్టీల ముఖ్యనేతలను ఆకర్షించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీలో ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేత రాజగోపాల్ రెడ్డి, మీడియా పరంగా బలమైన నేత వివేక వెంకటస్వామిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. మరికొందరు ముఖ్యనాయకులను ఎన్నికలకు ముందే పార్టీలోకి లాక్కోని బీజేపీని నియోజకవర్గ స్థాయిలోనూ పోటీలో లేకుండా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మాజీ మంత్రి డీకే అరుణకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీలో జనాకర్షణ కలిగిన విజయశాంతిని తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-05T10:39:20+05:30