Visakha: సీఎం జగన్ పర్యటన కోసం చెట్లు కొట్టేస్తున్న అధికారులు
ABN, First Publish Date - 2023-05-10T11:18:34+05:30 IST
విశాఖ: ముఖ్యమంత్రి జగన్ పర్యటన (CM Jagan Tour) అంటే చాలు అందరికంటే ఎక్కువగా చెట్లు (Trees) భయపడిపోతున్నాయి.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్ పర్యటన (CM Jagan Tour) అంటే చాలు అందరికంటే ఎక్కువగా చెట్లు (Trees) భయపడిపోతున్నాయి. సీఎం పర్యటన కోసం ముందుగా అధికారులు చెట్లు కొట్టేస్తున్నారు. భద్రతా కారణాలు అనే వంకతో చెట్లను కూకటివేళ్లతో సహా పెకలించివేస్తున్నారు. విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పర్యటన కోసం పీఎం పాలెం స్టేడియం వద్ద హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. బీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కోసం చెట్లను నరికివేస్తున్నారు. ఇన్ని రోజులు ‘మా దారి బాగోలేదు మహాప్రభో’ అని ప్రజలు కోరుతున్నా.. పట్టించుకోని అధికారులు సీఎం జగన్ రాక కోసం ఆగమేఘాల మీద రోడ్లు కూడా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-05-10T11:18:34+05:30