సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం..
ABN, First Publish Date - 2023-11-01T11:04:25+05:30 IST
తెలంగాణ: సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం మొదలుపెట్టారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం చేపట్టారు.
తెలంగాణ: సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం మొదలుపెట్టారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం చేపట్టారు. ఎన్నికల ప్రచారం అనంతరం తన ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజాము 3 గంటలకు బ్రహ్మ మూహూర్తంలో ఈ యాగం ప్రారంభించారు. ఐదు రోజులపాటు రాజశ్యామల యాగం కొనసాగనుంది. వంద మంది రుత్వికులు, వేద మంత్రాల మధ్య యాగం నిర్వహిస్తున్నారు. అలాగే చండీ యాగం కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-01T11:04:25+05:30