సీఎం కేసీఆర్ హామీ నెరవేరిందా..?
ABN, First Publish Date - 2023-07-22T11:03:17+05:30 IST
భద్రాచలం: ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 39.5 అడుగులకు చేరుకుంది.
భద్రాచలం: ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 39.5 అడుగులకు చేరుకుంది. దుగువన ఉన్న శబరి నది పోటువల్ల గోదావరిలో ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రవాహం మరింత తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తామని అధికారులు వెల్లడించారు. గోదావరి వరద గండం నుంచి శాశ్వత పరిష్కారం కోసం భద్రాచలం చుట్టూ కరకట్ట నిర్మాణం చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేరిందా? గతేడాది ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై స్థానిక నేతలు ఏమంటున్నారు? దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-07-22T11:03:17+05:30