సీఎంకు మూఢనమ్మకాలు ఎక్కువ..

ABN, First Publish Date - 2023-08-15T11:45:16+05:30 IST

హైదరాబాద్: సీఎం కేసీఆర్ గత వారం రోజుల నుంచి ఫామ్ హౌస్‌లో మకాం వేసి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి వాస్తు, జ్యోతిష్యం అన్న నమ్మకమెక్కువ.

హైదరాబాద్: సీఎం కేసీఆర్ గత వారం రోజుల నుంచి ఫామ్ హౌస్‌లో మకాం వేసి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి వాస్తు, జ్యోతిష్యం అన్న నమ్మకమెక్కువ. సీఎం ఏ కార్యక్రమం తలపెట్టినా మంచి మూహూర్తం చూసుకుని పనులు ప్రారంభిస్తారు. ఈసారి కూడా మంచి ముహూర్తంలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలియవచ్చింది. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.. డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించుకుని కార్యక్షేత్రంలోకి వెళ్లాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-15T11:45:16+05:30