టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2023-08-19T11:31:44+05:30 IST

ఏలూరు జిల్లా: పెదపాడు మండలం, వీరమ్మకుంటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

ఏలూరు జిల్లా: పెదపాడు మండలం, వీరమ్మకుంటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులపై లాఠీచార్జ్ చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-19T11:31:44+05:30