సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్‌లో కాక‌రేపుతోన్న అభ్య‌ర్థుల మార్పు..

ABN, First Publish Date - 2023-11-10T10:13:18+05:30 IST

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం మార్చింది. ముందుగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కట్టా శ్రీనివాస్ గౌడ్‌కు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ టికెట్ ప్రకటించింది.

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం మార్చింది. ముందుగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కట్టా శ్రీనివాస్ గౌడ్‌కు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ టికెట్ ప్రకటించింది. దీంతో శ్రీనివాస్ గౌడ్‌ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దామోదర రాజనర్సింహ ఒత్తిడితో చివరి క్షణంలో అధిష్టానం శ్రీనివాస్ గౌడ్‌ పేరును ప్రకటించింది. అభ్యర్ధి మార్పుతో నీలం మధు వర్గం ఆందోళనకు దిగింది. గత అర్ధరాత్రి జాతీయ రహదారిపై టైర్లు కల్చి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ, రేవంత్, దామోదర రాజనర్సింహకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-10T10:13:19+05:30