కియా పరిశ్రమను సందర్శించనున్న చంద్రబాబు

ABN, First Publish Date - 2023-08-03T11:18:51+05:30 IST

అనంతపురం: సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ కల్యాణమండపం నుంచి ఆత్మకూరు మండలం, సింగనగుట్ట వద్ద పంప్ హౌస్ నిర్మాణ పనులు...

అనంతపురం: సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ కల్యాణమండపం నుంచి ఆత్మకూరు మండలం, సింగనగుట్ట వద్ద పంప్ హౌస్ నిర్మాణ పనులు, అర్ధాంతరంగా ఆగిన కాలువ పనులు పరిశీలించనున్నారు. అక్కడే రైతులు, భూములిచ్చిన నిర్వాసితులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు చేరుకుంటారు. ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారని, కియా పరిశ్రమను సందర్శిస్తారని టీడీపీ నేతలు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-03T11:18:51+05:30